జిల్లా కేంద్రంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, పట్టణంలోని అంజనీపుత్ర వినాయక మండలిని సందర్శించి, విఘ్నేశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మండపానికి చేరుకున్న కలెక్టర్ కుమార్ దీపక్‌కు నిర్వాహకులు, వేద పండితులు ఘన స్వాగతం పలికారు. స్వామివారికి పట్టువస్త్రాలు, ఫలాలు సమర్పించిన కలెక్టర్, దేశ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మండప నిర్వాహకులు కలెక్టర్‌కు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి, వేదాశీర్వచనం అందించారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలో వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో, ఆధ్యాత్మిక శోభతో జరుపుకోవాలని సూచించారు. నిమజ్జన కార్యక్రమాలకు సంబంధించి అధికారులు, మండలి నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ప్రజలందరూ సహకరించి, పండుగను విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అంజనీపుత్ర మండప నిర్వాహకులు గుర్రాల శ్రీధర్ తోపాటు, స్థానిక నాయకులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. జిల్లాలో శాంతిభద్రతలను కాపాడుతూ, అందరూ కలిసికట్టుగా ఉత్సవాలను జరుపుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.











