పరాయి దేశమైన దుబాయ్‌లో, మతాలకు అతీతంగా హిందూ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షిస్తూ తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి () సభ్యులు వినాయక ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. ఐదు రోజుల పాటు పూజలు, భజనలు నిర్వహించి, శనివారం సాయంత్రం వినాయకుడిని నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని విఘ్నేశ్వరుడిని ప్రార్థించారు.
తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి () ఆధ్వర్యంలో దుబాయ్‌లో వినాయక ఉత్సవాలు ఘనంగా జరిగాయి. గత సంవత్సరాల మాదిరిగానే ఈ ఏడాది కూడా ఐదు రోజుల పాటు వినాయకుడికి ప్రత్యేక పూజలు, భజనలు నిర్వహించారు. శనివారం సాయంత్రం జరిగిన నిమజ్జన కార్యక్రమంతో ఉత్సవాలు ముగిశాయి. ఈ ఉత్సవాల నిర్వహణ గురించి వ్యవస్థాపక అధ్యక్షులు కల్లెడ భూమయ్య తెలిపారు.
ప్రభుత్వ హామీలపై ఆవేదన
రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు గడిచినా, గల్ఫ్ కార్మికులకు ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం లేదని కల్లెడ భూమయ్య ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని దక్కన్ హోటల్లో జరిగిన గల్ఫ్ సంఘాల సమావేశంలో ముఖ్యమంత్రి హోదాలో శ్రీ రేవంత్ రెడ్డి గల్ఫ్ అండ్ అదర్ ఓవర్సీస్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. ఆ హామీకి కట్టుబడి ఉండాలని, గల్ఫ్‌లో మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం అందించేలా ముఖ్యమంత్రి మనసు వచ్చేలా, గల్ఫ్ కార్మికులందరూ బాగుండాలని ఆ విఘ్నేశ్వరుడిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు.
యూఏఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు
ఇస్లామిక్ దేశమైన దుబాయ్‌లో హిందూ పండుగలను నిర్వహించుకోవడానికి అక్కడి ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం సంతోషకరమని కల్లెడ భూమయ్య అన్నారు. యూఏఈ దుబాయ్ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని వారు దుబాయ్ నుండి శరవాణి ద్వారా తెలిపారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు
ఈ పూజా కార్యక్రమాలలో తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి అధ్యక్షులు కల్లెడ భూమయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహ్మద్ అలీమ్, కడం మండల ఇంచార్జ్ ధర్మాజీ సత్తన్న, జుంబర్తి గంగాధర్, కోఆర్డినేటర్ కునారపు రమేష్, కరుణాకరణ్, మనోజ్, తిరుపతి, నరసయ్య, రాజన్న సాయి నారాయణ, నవీన్ కుమార్, విజయ్ నరేష్ మణికంఠ, శ్రీనివాస్ సత్తన్న నంబయ్య, రామన్న, శశి రణధీర్, భినేష్, రాజేందర్, శ్రీధర్ తో పాటు వివిధ జిల్లాల, రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు, కార్మికులు పాల్గొన్నారు.











