నస్పూర్ లోని టీఎన్జీవో హౌసింగ్ కాలనీలో శ్రీ సిద్ధి వినాయక గణేష్ మండలి వద్ద లోక కళ్యాణార్థం గణపతి హోమం నిర్వహించారు. టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు, హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు శ్రీమతి గడియారం పల్లవి శ్రీహరి, శ్రీ సిద్ధి వినాయక ఉత్సవ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీమతి గుండేటి అరుణ యోగేశ్వర్ ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా అధ్యక్షులు శ్రీ గడియారం శ్రీహరి గారు మాట్లాడుతూ, శ్రీ సిద్ధి వినాయకుని ఆశీస్సులతో గణపతి హోమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. శ్రీ సిద్ధి వినాయకుని ఆశీస్సులు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లకు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. అదేవిధంగా, ఈ రోజు సాయంత్రం ప్రభుత్వంతో తెలంగాణ రాష్ట్ర చైర్మన్ శ్రీ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ శ్రీ ఏలూరి శ్రీనివాసరావు మరియు కార్యవర్గ సభ్యులతో జరుగు చర్చలు సఫలం అయి, ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలైన , పెండింగ్ 6లు, అమలు, సమర్థవంతంగా అమలు చేయడం, పెండింగ్ బిల్లులు అన్నీ నెరవేరాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ గణపతి హోమంలో శ్రీనివాస్ కళ్యాణి దంపతులు, సునీల్ శ్రావణి దంపతులు, వెంకన్న శిరీష దంపతులు పాల్గొని హోమం చేశారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవోస్ హౌసింగ్ సొసైటీ ఉత్సవ కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి కస్తూరి నాగేశ్వర్ గారు, టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ కార్యదర్శి శ్రీ హబీబ్ హుస్సేన్ గారు, ఉపాధ్యక్షులు సైడ్ల మొండయ్య గారు, టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ నాయకులు పుప్పాల హనుమంత రావు, పొన్న మల్లయ్య, శ్రీపతి బాపురావు, బొడ్డు శ్రావణ్ కుమార్, భూముల రామ్మోహన్, సతీష్ కుమార్, తిరుపతి రెడ్డి, సునీత, టి.తిరుపతి, జె.రాంకుమార్, ప్రసాద్, ఉషన్నగారు, టీఎన్జీవో కాలనీ నాయకులు, మహిళలు పాల్గొన్నారు.











