మంచేరియల్, 16 October
మంచిర్యాల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రంగపేటలో శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ లక్ష్యంగా పోలీసులు కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా సరైన ధ్రువపత్రాలు లేని 40 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు.
16-10-2026న మంచిర్యాల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రంగపేటలో శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల నివారణ మరియు ప్రజల్లో భద్రతాభావాన్ని పెంపొందించే ఉద్దేశంతో పోలీసులు కార్డెన్ అండ్ సెర్చ్ ( ) నిర్వహించారు.
మంచిర్యాల టౌన్ ఇన్స్పెక్టర్ ప్రమోద్ రావు ఆధ్వర్యంలో ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది గ్రామంలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలను తనిఖీ చేసి, వాటికి సంబంధించిన ధ్రువపత్రాలను పరిశీలించారు.
ఈ తనిఖీల సందర్భంగా సరైన ధ్రువపత్రాలు లేని 40 ద్విచక్ర వాహనాలను పోలీసులు సీజ్ చేశారు.
చట్టవ్యతిరేక కార్యకలాపాలపై అవగాహన
అనంతరం గ్రామ ప్రజలు, యువతతో ఇన్స్పెక్టర్ ప్రమోద్ రావు మాట్లాడుతూ, గంజాయి, ఇతర మత్తు పదార్థాలు, సైబర్ క్రైమ్, ట్రాఫిక్ నిబంధనలు, జూదం వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. గ్రామంలో అనుమానాస్పద వ్యక్తులు సంచరించినా లేదా చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిసినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
యువతకు క్రీడా సామగ్రి అందజేత
గ్రామ యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి, క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలనే ఉద్దేశంతో మంచిర్యాల టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో యువతకు వాలీబాల్, వాలీబాల్ నెట్ను అందజేశారు. యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించి మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల టౌన్ ఇన్స్పెక్టర్ ప్రమోద్ రావు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.












