మంచేరియల్, 18 September
నస్పూర్ లోని టీఎన్జీవో హౌసింగ్ కాలనీలో శ్రీ సిద్ధి వినాయక గణేష్ మండలి వద్ద 4వ రోజు మహా అన్నదానం జరిగింది. ఈ కార్యక్రమానికి టీఎన్జీవో కేంద్ర సంఘం కార్యదర్శి శ్రీ పొన్న స్వప్న మల్లయ్య, శ్రీమతి శ్రీ హనుమాండ్ల విమల రాఘవరెడ్డి దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
టీఎన్జీవో హౌసింగ్ కాలనీ నస్పూర్ లోని శ్రీ సిద్ధి వినాయక గణేష్ మండలి వద్ద 4వ రోజు మహా అన్నదానం జరిగింది. ఈ అన్నదానాన్ని టీఎన్జీవో కేంద్ర సంఘం కార్యదర్శి మరియు టీఎన్జీవో ఫారెస్ట్ సెంట్రల్ ఫోరం అధ్యక్షులు శ్రీ పొన్న స్వప్న మల్లయ్య పుణ్య దంపతులు, శ్రీమతి శ్రీ హనుమాండ్ల విమల రాఘవరెడ్డి పుణ్య దంపతులు నిర్వహించారు. తదుపరి, టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షులు మరియు టీఎన్జీవో ఫారెస్ట్ సెంట్రల్ ఫోరం అధ్యక్షులు శ్రీమతి శ్రీ పొన్న స్వప్న మల్లయ్య గార్లు శ్రీ సిద్ధి వినాయకుని పూజలు చేశారు. ప్రజలందరూ బాగుండాలని, ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలన్నీ తొలగిపోవాలని కోరుకుంటూ, సిరిసిల్ల చేనేత కార్మికులు స్వయంగా నేసిన అగ్గిపెట్టలో పట్టు శాలువాను శ్రీ సిద్ధి వినాయకునికి సమర్పించారు. ఈ సందర్భంగా టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు శ్రీ గడియారం శ్రీహరి గారు మాట్లాడుతూ, టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ కాలనీ నస్పూర్ లో శ్రీ సిద్ధి వినాయకుని జిల్లా ప్రజలందరికీ ఉండాలని, తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలన్నీ శ్రీ సిద్ధి వినాయక ఆశీస్సులతో తొందరలోనే పరిష్కారం కావాలని ఆకాంక్షించారు. అలాగే, టీఎన్జీవో హౌసింగ్ కాలనీ శ్రీ సిద్ధి వినాయక మండలిలో నవరాత్రులను పురస్కరించుకొని ప్రతిరోజు మధ్యాహ్నం మహా అన్నదానం, సాయంత్రం అల్పాహారం దాతల సహకారంతో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన కలెక్టర్ కార్యాలయ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీనివాసరావు దేశ్ పాండే గారిని, టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అసోసియేట్ అధ్యక్షులు శ్రీమతి శ్రీపతి మంజుల బాపురావు గార్లను టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు శ్రీ గడియారం శ్రీహరి గారి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. తదుపరి, టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు శ్రీ గడియారం శ్రీహరి గారి ఆధ్వర్యంలో, ముఖ్యఅతిథి కలెక్టర్ కార్యాలయ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీ శ్రీనివాస రావు దేశపాండే గారు, సభ్యులు అందరూ కలిసి శ్రీమతి శ్రీ పొన్న స్వప్న మల్లయ్య, శ్రీమతి శ్రీ హనుమాండ్ల విమల రాఘవరెడ్డి పుణ్య దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ మహా అన్నదాన కార్యక్రమంలో టీఎన్జీవోస్ హౌసింగ్ సొసైటీ కార్యదర్శి శ్రీ హబీబ్ హుస్సేన్, టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ శ్రీ సిద్ధి వినాయక ఉత్సవ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షులు గుండేటి యోగేశ్వర్, కార్యదర్శులు కస్తూరి నాగేశ్వర్, హౌసింగ్ సొసైటీ నాయకులు పుప్పాల హనుమంత రావు, శ్రీపతి బాపురావు, సైడ్ల మొండయ్య, బొడ్డు శ్రావణ్ కుమార్, భూముల రామ్మోహన్, సతీష్ కుమార్, తిరుపతి రెడ్డి, సునీత, ఎన్. సత్యనారాయణ, టి. తిరుపతి, రాంకుమార్, రాజేందర్, బెక్కం ఉషన్న, టీఎన్జీవో కాలనీ నాయకులు, మహిళలు పాల్గొన్నారు.












