క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ 18వ వార్డు పరిధిలోని అశోక్‌నగర్‌లో ప్రజాసమస్యల పరిష్కారానికి స్థానిక కౌన్సిలర్ పల్లె శ్రీదేవి రాజన్న చొరవ చూపారు. కాలనీలో తీవ్రంగా దెబ్బతిన్న రహదారి వల్ల స్థానికులు పడుతున్న అవస్థలను గుర్తించి, మున్సిపల్ అధికారులతో మాట్లాడి వెంటనే రోడ్డు మరమ్మతు పనులు ప్రారంభించారు.
అలాగే, రాత్రివేళల్లో కాలనీవాసులకు ఇబ్బందిగా మారిన పనిచేయని హైమాస్ట్ దీపానికి పురపాలక సిబ్బందితో వెంటనే మరమ్మతులు చేయించి పునరుద్ధరించారు. ప్రజాసమస్యల పరిష్కారమే తన తొలి ప్రాధాన్యమని, వార్డులో ఏ సమస్య ఉన్నా నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చని ఈ సందర్భంగా కౌన్సిలర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పల్లె రాజు, బోనగిరి రవీందర్, ఇబ్రహీం, రామిల్ల శ్రీనివాస్, సురేష్‌లతో పాటు పలువురు కాలనీవాసులు పాల్గొన్నారు.











