మంచేరియల్, 26 September
కోకాపేట నమణమవతననపెక్షాత్మక భవననమణనకు మంచయజమండం క్యాతనపల్లికి చెందనపమఖబీజేపీ నాయకులు అక్కల రమేష్ కోకాపేటలో నిర్మాణమవుతున్న పెరిక ఆత్మగౌరవ భవనానికి రూ.1,00,000 (ఒక లక్ష రూపాయల) విరాళం అందించి తన ఉదారతను చాటుకున్నారు.
మంచిర్యాల జిల్లా మండలం క్యాతనపల్లికి చెందిన కులబంధువు, ప్రముఖ బీజేపీ నాయకులు అక్కల రమేష్ కోకాపేటలో నిర్మాణమవుతున్న పెరిక ఆత్మగౌరవ భవనానికి రూ.1,00,000 (ఒక లక్ష రూపాయల) విరాళం అందించి తన ఉదారతను చాటుకున్నారు.
.., .. విద్యార్హతలు కలిగిన అక్కల రమేష్ , మంచిర్యాల జిల్లా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులుగా సేవలందిస్తున్నారు.
కుల ఆత్మగౌరవానికి ప్రతీకగా, భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగకరంగా నిలిచే కోకాపేట పెరిక భవన్ నిర్మాణంలో తనవంతు సహకారం అందించిన అక్కల రమేష్ కి రాష్ట్ర అధ్యక్షులు గటిక విజయ్ కుమార్ కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు.
హైకోర్టు న్యాయవాది, లాయర్ విభాగపు కోఆర్డినేటర్ అక్కల తిరుపతి వర్మ, అక్కల రమేష్ ఇరువురు అన్నదమ్ములు. వీరు కోకపేట భవన నిర్మాణానికి విరాళం అందించి కులబంధువులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
త్వరలో ఏడవ స్లాబ్ నిర్మాణ పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో, కులబంధువులందరూ స్పందించి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని రాష్ట్ర అధ్యక్షులు గటిక విజయ్ కుమార్ కోరారు.
అక్కల రమేష్ కి రాష్ట్ర అధ్యక్షులు గటిక విజయ్ కుమార్, గౌరవాధ్యక్షులు మద్దా లింగయ్య,, రాష్ట్ర కార్యవర్గం కృతజ్ఞతలు తెలిపారు.











