పెద్దపల్లి, 2026-07-26
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన విశాల్ మార్ట్ షాపింగ్ మాల్ ను గౌరవ ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ. చింతకుంట విజయరమణ రావు గారు స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన షాపు యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు. షాపు యాజమాన్యం ప్రభుత్వ విప్ కు ఘనస్వాగతం పలికి, సత్కరించారు.
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన విశాల్ మార్ట్ షాపింగ్ మాల్ ను గౌరవ ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ. చింతకుంట విజయరమణ రావు గారు స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన షాపు యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు.
నూతనంగా ప్రారంభమైన విశాల్ మార్ట్ షాపింగ్ మాల్ ను సందర్శించిన ప్రభుత్వ విప్ శ్రీ. చింతకుంట విజయరమణ రావు గారు, షాపులోని వివిధ విభాగాలను పరిశీలించారు. స్థానిక ప్రజలకు నాణ్యమైన ఉత్పత్తులను అందుబాటు ధరల్లో అందించాలనే లక్ష్యంతో ఈ మాల్ ను ఏర్పాటు చేసినట్లు యాజమాన్యం తెలిపారు. ఈ సందర్భంగా షాపు యాజమాన్యం ప్రభుత్వ విప్ కు ఘనస్వాగతం పలికి, సత్కరించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, విశాల్ మార్ట్ యాజమాన్య ప్రతినిధులు, సిబ్బంది, మరియు పలువురు స్థానికులు పాల్గొన్నారు. పెద్దపల్లి పట్టణ ప్రజలకు అవసరమైన వస్తువులన్నీ ఒకేచోట లభించేలా విశాల్ మార్ట్ ఏర్పాటు చేయడం సంతోషకరమని, ఇది ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని ప్రభుత్వ విప్ అన్నారు. వ్యాపార రంగంలో మరిన్ని విజయాలు సాధించాలని ఆయన యాజమాన్యానికి ఆకాంక్షించారు.












