మంచేరియల్, 2026-06-28
ఫేక్ వార్తలను ప్రచారం చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అంజనీపుత్ర రియల్ ఎస్టేట్ యాజమాన్యం హెచ్చరించింది. సోషల్ మీడియాలో తమపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని, తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తే జైలుకేనని హెచ్చరికలు జారీ చేసింది. కోట్లాది రూపాయల పరువు నష్ట దావాకు సిద్ధమని ప్రకటించింది.
ఫేక్ వార్తలు ప్రచారం చేసినా, ఇతర వాట్సాప్ గ్రూపుల్లో కానీ, ఏ ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో కానీ షేర్ చేసినా చట్టపరమైన చర్యలు తప్పవని అంజనీపుత్ర రియల్ ఎస్టేట్ యాజమాన్యం హెచ్చరించింది. డిజిటల్ తెర వెనుక దాక్కున్న పిరికిపందలారా, మీ ఆటలు ఇక సాగవని, అంజనీపుత్రపై దుష్ప్రచారాన్ని చేసే బ్లాక్మెయిలర్ల ముసుగులు తొలగిస్తామని, కోట్లాది రూపాయల పరువు నష్ట దావాకు సిద్ధమని ప్రకటించింది.
ఫేక్ పీడీఎఫ్ (PDF) క్రియేటర్లకు గట్టి కౌంటర్ ఇస్తూ, రంగంలోకి దిగిన అంజనీపుత్ర యాజమాన్యం, తమ పారదర్శక ప్రస్థానాన్ని కొనసాగిస్తామని, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని కోరింది. మీ నమ్మకమే మా బలం, ఆ నమ్మకానికి ఎలాంటి ఢోకా లేదని స్పష్టం చేసింది. అడ్డంకులను దాటుకుంటూ అగ్రస్థానంలోకి దూసుకెళ్తున్న తమ అప్రతిహత ప్రయాణాన్ని కొనసాగిస్తామని, కుట్రలను భగ్నం చేసి, న్యాయం వైపే నిలబడతామని, తప్పుడు వార్తలకు చెక్ పెట్టి, లీగల్ యాక్షన్ కు సిద్ధంగా ఉన్నామని అంజనీపుత్ర రియల్ ఎస్టేట్ అధికారిక ప్రకటనలో తెలిపింది.












