మంచేరియల్, July 02, 2026
2025-26 రబీ సీజన్ ధాన్యం సీఎంఆర్ డెలివరీ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు రైస్ మిల్లర్లను ఆదేశించారు. గురువారం పౌరసరఫరాల శాఖ అధికారులతో కలిసి ఆయన ఈ అంశంపై సమీక్ష నిర్వహించారు. ధాన్యం వేలానికి సంబంధించిన బకాయిలను ఈ నెల 15లోగా 100 శాతం చెల్లించాలని సూచించారు.
జిల్లాలోని రైస్ మిల్లర్లు 2025-26 రబీ సీజన్ సంబంధిత ధాన్యం సీఎంఆర్ డెలివరీ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు అన్నారు. గురువారం జిల్లాలోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని తన ఛాంబర్లో పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారి బ్రహ్మ రావు, జిల్లా మేనేజర్ శ్రీకళలతో కలిసి రైస్ మిల్లర్లతో సీఎంఆర్ డెలివరీ ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, 2025-26 ప్రస్తుత రబీ సీజన్ సంబంధిత సీఎంఆర్ డెలివరీని వేగవంతం చేయాలని సూచించారు. అలాగే, 2024-25 రబీ, 2025-26 ఖరీఫ్ సీజన్లకు సంబంధించిన ధాన్యం సీఎంఆర్ డెలివరీ ప్రక్రియకు కార్యాచరణ రూపొందించాలని, మిషన్ కె 100లో భాగంగా సీఎంఆర్ డెలివరీ ప్రక్రియను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని తెలిపారు.
ఈ నెల 15వ తేదీలోగా ధాన్యం వేలానికి సంబంధించిన బకాయిలను 100 శాతం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, రైస్ మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు.












