కరెంటు పోల్లు విరిగిపోవడం వల్ల రైతు యాదినేని పెద్దమల్లయ్యకు చెందిన మూడు గేదెలు మరణించాయి.
బుచ్చయ్య పల్లి గ్రామపంచాయతీలో నిన్న జరిగిన గాలి వానల కారణంగా కరెంటు పోల్లు విరిగి పడటంతో, పశువులు మేతకు వెళ్ళిన సమయంలో కరెంట్ షాక్కు గురయ్యాయి.
ఈ ఘటనలో, రైతు యాదినేని పెద్దమల్లయ్య తన మూడు పాలిచ్చే గేదెలను కోల్పోయాడు. ఆయన మాట్లాడుతూ, "నా జీవనోపాధికి సహకరించిన గేదెలు చనిపోవడం వల్ల నేను బ్రతుకు తెరువు కోల్పోయాను" అని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఈ ఘటన వల్ల రైతుకు సుమారు 3 లక్షల రూపాయల నష్టం జరిగిందని ఆయన తెలిపారు. రైతుకు ప్రభుత్వం సహాయం అందించాలనే కోరుతో, గ్రామపంచాయతీ వార్డు సభ్యుడు బత్తుల రమేష్ సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది.
ప్రభుత్వ అధికారులు రైతు కుటుంబాన్ని ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.












