కాలేజీ రోడ్డులో రెడీమిక్స్ లారీలు నిర్లక్ష్యంగా తిరుగుతూ, రహదారులపై కంకర, రెడీమిక్స్ మిశ్రమాన్ని చిందిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని, ఈ సమస్యపై కార్పొరేషన్ సమావేశంలో బీజేపీ కార్పొరేటర్ కస్తూరి నాగరాజు ఫిర్యాదు చేశారు. దీనిపై మేయర్, కమిషనర్ స్పందించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
కాలేజీ రోడ్డులో రెడీమిక్స్ లారీలు నిర్లక్ష్యంగా తిరుగుతూ, విద్యార్థులు, ప్రజలు నడిచే రహదారులపై కంకర, రెడీమిక్స్ మిశ్రమాన్ని చిందిస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని, ఈ విషయాన్ని పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువచ్చినా సమస్య పరిష్కారం కాలేదని తెలిపారు.
ఈ అంశాన్ని కార్పొరేషన్ సమావేశంలో బీజేపీ కార్పొరేటర్ కస్తూరి నాగరాజు గారు మేయర్, కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లి, విద్యార్థులు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.
దీనిపై స్పందించిన మేయర్, కమిషనర్ గారు వెంటనే గారికి సమాచారం అందించి, సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని రెడీమిక్స్ లారీలపై నియంత్రణ చర్యలు తీసుకుని, రహదారులపై కంకర, రెడీమిక్స్ చిందకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇదిలా ఉండగా, ప్రాంతంలో పెరుగుతున్న వీధి కుక్కలు, దోమల సమస్యపై తక్షణ చర్యలు తీసుకుని ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కౌన్సిల్ సమావేశంలో కోరారు.
అదేవిధంగా తెలంగాణ ప్రజల ప్రధాన పండుగలైన బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను కోరారు.
పండుగల సందర్భంగా పారిశుధ్యం, దోమల నివారణ, వీధి దీపాలు, రోడ్ల పరిశుభ్రత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కౌన్సిల్లో విజ్ఞప్తి చేశారు.












