పోలీసుల ఆరోగ్య పరిరక్షణ, శారీరక దారుఢ్యం అత్యంత కీలకమని, ప్రతి అధికారి, సిబ్బంది తమ ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచించారు. పోలీసు కమిషరేట్ హెడ్‌క్వార్టర్స్‌లో అర్ముడ్ సిబ్బందికి నిర్వహించిన వారాంత పరేడ్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రామగుండం పోలీస్ కమిషరేట్ హెడ్‌క్వార్టర్స్ పరేడ్ గ్రౌండ్లో అర్ముడ్ సిబ్బందికి నిర్వహించిన వారాంత పరేడ్‌కు ముఖ్య అతిథిగా హాజరైన పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, కమాండర్‌గా వ్యవహరించిన అడ్మిన్ ఆర్ఐ శేఖర్ నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం సిబ్బంది ప్రదర్శనను పరిశీలించి, విధుల నిర్వహణకు శారీరక దారుఢ్యం అత్యంత ముఖ్యమని నొక్కి చెప్పారు.
నిత్య విధులతో పాటు ఎన్నికల విధుల్లోనూ కష్టపడి పనిచేసిన సిబ్బందిని అభినందిస్తూ, సుమారు వంద మంది సిబ్బంది పాల్గొని పరేడ్‌ను విజయవంతంగా నిర్వహించారని ప్రశంసించారు. పోలీస్ ఉద్యోగంలో ఆరోగ్యం, శారీరక సామర్థ్యమే ప్రధాన బలమని, ఫిట్‌గా ఉంటేనే ఏ బాధ్యతనైనా సమర్థవంతంగా నిర్వర్తించగలమని పేర్కొన్నారు. ఆహారపు అలవాట్లు, విశ్రాంతి, వ్యాయామం వంటి అంశాలపై ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలని సూచించారు.
పోలీసు సిబ్బంది ఆరోగ్య పరిరక్షణ కోసం కమిషనరేట్ పరిధిలో తరచూ వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని, త్వరలో మరో మెగా మెడికల్ క్యాంపును కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వివిధ వైద్య నిపుణులను అందుబాటులోకి తీసుకువచ్చి సిబ్బందికి మెరుగైన ఆరోగ్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మహిళా పోలీస్ అధికారులు, సిబ్బంది పరేడ్‌లో చురుకుగా పాల్గొనడాన్ని అభినందించి, పోలీస్ యూనిఫాంలో ఉన్న ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు, బాధ్యతలు, అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
భవిష్యత్తులో మహిళా పోలీసుల కోసం ప్రత్యేక ప్లాటూన్ల ఏర్పాటు దిశగా చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నామని వెల్లడించారు. సిబ్బంది మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండటం వల్ల ఫిట్నెస్, పనితీరు, టర్నౌట్ మరింత మెరుగుపడుతాయని పేర్కొన్నారు. పరేడ్‌లో కొన్ని సాంకేతిక అంశాల్లో సమన్వయం మెరుగుపర్చాల్సిన అవసరం ఉన్నప్పటికీ, మొత్తం ప్రదర్శన సంతృప్తికరంగా ఉందని కమిషనర్ అభిప్రాయపడ్డారు.












