మంచేరియల్, 2026-07-31
మంచిర్యాల జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్ట్ గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. గోదావరిలో ప్రవాహం భారీగా పెరిగింది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో చెరువులు, ప్రాజెక్టులు నిండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మంచిర్యాల జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్ట్ గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. దీనితో గోదావరి ప్రవాహం భారీగా పెరిగి, ఒక ఒడ్డు నుంచి మరో ఒడ్డు వరకు పారుతోంది. తెల్లవారుజాము నుంచే ప్రాజెక్టు వద్ద సందర్శకుల తాకిడి బాగా పెరిగింది.
ఈ సంవత్సరం వర్షపాతం తక్కువగా ఉందని రైతులు ఆందోళన చెందుతున్నప్పటికీ, గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న అతి భారీ వర్షాల వల్ల చెరువులు, ప్రాజెక్టులు పూర్తిగా నిండిపోయాయి. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.










