తెలంగాణ రాష్ట్ర తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో మంచిర్యాల జిల్లాకు చెందిన విద్యార్థులు పలు పతకాలు సాధించి తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ పోటీల్లో వివిధ వయసుల విభాగాల్లో విద్యార్థులు పాల్గొని విజయాలు అందుకున్నారు.
హైదరాబాద్లోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన తొమ్మిదవ రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో మంచిర్యాల జిల్లా విద్యార్థులు పాల్గొని పతకాలు సాధించినట్లు మంచిర్యాల జిల్లా తైక్వాండో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రంగు శ్రీనివాస్ తెలిపారు.
క్యాడెట్ బాయ్స్ అండర్ 61 కేజీ ఫైటింగ్ విభాగంలో మోక్షిత్ బంగారు పతకం సాధించగా, అండర్ 41 కేజీ విభాగంలో శ్రీవాస్తవ, జెస్విత్ కాంస్య పతకాలు గెలుచుకున్నారు. దేవర్శిస్ అండర్ 36 కేజీ ఫైటింగ్ విభాగంలో కాంస్య పతకం సాధించారు.
సబ్ జూనియర్ బాయ్స్ అండర్ 35 కేజీ ఫైటింగ్ విభాగంలో దీమన్ రజత పతకాన్ని, సబ్ జూనియర్ బాలికల విభాగం అండర్ 36 కేజీ ఫైటింగ్ విభాగంలో విజ్ఞ శ్రీ రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు. క్యాడెట్ బాలికల విభాగంలో ఆరాధ్య, హ్రీధ్య, అవంతిక కాంస్య పతకాలు సాధించారు.
పతకాలు సాధించిన విద్యార్థులను మంచిర్యాల జిల్లా తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షులు అక్కల రమేష్ అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు కోచ్లు, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.






