మంచేరియల్, 2026-07-03
నాసిక్‌లో జరిగిన జాతీయస్థాయి పెన్కాక్ సిలాట్ పోటీల్లో శ్రీ సాయి మాతృ మందిర్ పాఠశాల విద్యార్థులు సిల్వర్ మెడల్ గెలుచుకున్నారు. జూన్ 20 నుంచి 28 వరకు జరిగిన ఈ పోటీల్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన విద్యార్థులను కార్పొరేటర్ జోగుల సదానంద, కోచ్ అసలు రాజేశ్వరి సన్మానించారు.
మహారాష్ట్రలోని నాసిక్‌లో జూన్ 20 నుంచి 28 వరకు జరిగిన జాతీయస్థాయి పెన్కాక్ సిలాట్ పోటీల్లో 21వ డివిజన్‌కు చెందిన శ్రీ సాయి మాతృ మందిర్ పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి సిల్వర్ మెడల్ సాధించారు. వీరిని 21వ డివిజన్ కార్పొరేటర్ జోగుల సదానంద, అక్షర వేదశ్రీ మహాలక్ష్మి నియన్స్, కోచ్ అసలు రాజేశ్వరి అభినందించి సన్మానించారు.








