మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని నాలుగవ డివిజన్ బాలాజీ స్కూల్ ఆవరణలో ఈరోజు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం జరిగింది. శ్రీరాంపూర్ సీఐ ఆదేశాల మేరకు ఎస్సై సంతోష్ ఈ కార్యక్రమానికి హాజరై, రోడ్డు ప్రమాదాలకు కారణమయ్యే అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ఎస్సై సంతోష్ మాట్లాడుతూ, మత్తు పానీయాలు సేవించి వాహనాలు నడపడం, సీటుబెల్టు ధరించకపోవడం, సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, అతివేగంగా వాహనాలు నడపడం వంటివి రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలని తెలిపారు. వీటిని నివారించడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చని సూచించారు.
ఈ కార్యక్రమంలో ప్రజలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నాలుగో డివిజన్ పోలీస్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో రోడ్డు భద్రత డివిజన్ కమిటీ 12 మంది సభ్యులతో ఎన్నుకోబడింది.
కార్యక్రమానికి నాల్గవ డివిజన్ కార్పొరేటర్ గుమ్మడి శ్రీనివాస్, 04 వ డివిజన్ ఆఫీసర్ ఎం నాగార్జున, అంగన్వాడి టీచర్ పి సుమలత, PHC హెల్త్ సెంటర్ డాక్టర్ సాయి ప్రణతి, ఏఎన్ఎం త్రివేణి, ఆశా కార్యకర్తలు శ్యామల, స్వర్ణలత, శ్రీదేవి తదితరులు హాజరయ్యారు. చివరగా, డాక్టర్ సాయి ప్రణతి గారి ఆధ్వర్యంలో హాజరైన వారికి సన్మానం చేశారు.





