మంచేరియల్, జూలై 22
క్యాతన్ పల్లి మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ పట్టణ ప్రజలను హెచ్చరించారు. పుర వీధులు, ప్రధాన రహదారుల్లో ఆవులు, గేదెలను విచ్చలవిడిగా వదిలిపెడితే కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. రోడ్లపై తిరిగే పశువుల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
క్యాతన్ పల్లి పుర వీధులు, ప్రధాన రహదారుల్లో ఆవులు, గేదెలను విచ్చలవిడిగా వదిలిపెడితే కఠిన చర్యలు తప్పవని మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ స్పష్టం చేశారు.
పట్టణంలో పశువులు రోడ్లపై తిరగడం వల్ల బాటసారులు, వాహనదారులు తీవ్ర ప్రమాదాల బారినపడి గాయపడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
పశువుల యజమానులు ఈ ప్రకటన వెలువడిన 3 రోజుల్లోగా తమ జీవాలను సొంత ఇంటి ఆవరణలోనే కట్టి ఉంచుకోవాలని ఆదేశించారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పశువులను స్వాధీనం చేసుకుని గోశాలలకు తరలిస్తామని కమిషనర్ హెచ్చరించారు.












