మంచేరియల్, 29/07/2026
భారీ వర్షాలు, వాగులు వంకలు పొర్లుతున్నప్పటికీ లెక్కచేయకుండా ఆదివాసీ హక్కుల పోరాట సమితి 'తుడుందెబ్బ' మంచిర్యాల జిల్లా శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చాయి. ఆదివాసీ హక్కుల పోరాట సమితి 'తుడుందెబ్బ' రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు, మంచిర్యాల పట్టణంలోని మార్క్స్ భవన్ లో 'తుడుందెబ్బ', AEWCA, ఆధార్ సొసైటీ మరియు రాయ్సెంటర్ ఆధ్వర్యంలో తుడుందేబ్బ మంచిర్యాల జిల్లా నూతన కమిటీ ఎన్నికలు నిర్వహించడం జరిగింది.
భారీ వర్షాలు, వాగులు వంకలు పొర్లుతున్నప్పటికీ లెక్కచేయకుండా ఆదివాసీ హక్కుల పోరాట సమితి 'తుడుందెబ్బ' మంచిర్యాల జిల్లా శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చాయి. ఆదివాసీ హక్కుల పోరాట సమితి 'తుడుందెబ్బ' రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు, మంచిర్యాల పట్టణంలోని మార్క్స్ భవన్ లో 'తుడుందెబ్బ', AEWCA, ఆధార్ సొసైటీ మరియు రాయ్సెంటర్ ఆధ్వర్యంలో తుడుందేబ్బ మంచిర్యాల జిల్లా నూతన కమిటీ ఎన్నికలు నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన తుడుందేబ్బ రాష్ట్ర అధ్యక్షులు గోడం గణేష్ గారు సభను ఉద్దేశించి మాట్లాడారు. మన హక్కుల చట్టాలు ఎలా కాలరాయబడుతున్నాయో ప్రజలకు తెలియజేయాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు. ప్రభుత్వాలు మన హక్కులను, చట్టాలను నిర్వీర్యం చేసే కుట్రలు చేస్తున్నాయని, ప్రభుత్వం మనకు సవతి తల్లి ప్రేమ చూపుతోందని, మనం ఎన్నిరోజులు వారిపై నమ్మకంతో ఉండాలని ప్రశ్నించారు. వారితో ఒరిగేది ఏమీ లేదని, కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మెడలు వంచి మన హక్కుల కోసం పోరాడుదామని పిలుపునిచ్చారు.
ఆదివాసీలందరూ ఒకే తాటిపైకి వచ్చి, తమ అస్తిత్వం కోసం పోరాడినప్పుడే ఆదివాసీల కోసం నిజమైన ఉద్యమ నిర్మాణం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే ఆదివాసీలకు ఎంతో కీలకమైన జీవో నంబర్ 3 రద్దయిందని, అలాగే 1/70 చట్టం కూడా ప్రమాదంలో ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాల నుంచి ఆదివాసీలకు అందాల్సిన సంక్షేమ పథకాలు సరిగా అందడం లేదని, స్థానిక రిజర్వేషన్లు కూడా కోల్పోయే పరిస్థితులు కనిపిస్తున్నాయని తెలిపారు. కాబట్టి మనమందరం ఐక్యంగా ఉండి పోరాడితేనే మన హక్కులను సాధించుకోగలమని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో తుడుందేబ్బ రాష్ట్ర, జిల్లా నాయకులు, AEWCA, ఆధార్ సొసైటీ, రాయ్సెంటర్ ప్రతినిధులు, ఆదివాసీ ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పాలగోని నూతన జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా మడవి వేకంటేష్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా మేకల మహేందర్, ఆదివాసి యువజన జిల్లా అధ్యక్షుడిగా టాట్ర అర్జున్, యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా కుడుమేత వసంత్, ఆదివాసి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడిగా కుర్సంగా రాజ్ కుమార్ ఎన్నికయ్యారు. అన్ని విభాగాల కమిటీలు పూర్తి చేశారు.
ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు గోడం గణేష్, AEWCA రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గేడం జనార్ధన్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కుర్సేంగా వేంకటేశ్, రాష్ట్ర కార్యదర్శులు గంజి రాజన్న, అర్క శేషారావు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వేట్టి మనోజ్, అదిలాబాద్ ఉపాధ్యక్షులు సోయం రాందాస్, అదిలాబాద్ కార్యదర్శి గేడం భరత్, అదిలాబాద్ డివిజన్ అధ్యక్షుడు అత్రం గణపతి మరియు తదితరులు పాల్గొన్నారు.












