Mancherial/Jaipur (ప్రజావార్త) జూలై 27
రెండు దశాబ్దాలుగా తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనానికి పాటుపడుతున్న తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలిగా మారిపల్లి మాధవిని నియమిస్తూ ఫౌండర్ ఛైర్పర్సన్ కల్వకుంట్ల కవిత సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకంతో సంస్థ కార్యకలాపాల్లో నూతన అధ్యాయం ప్రారంభమైంది.
తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనం కోసం రెండు దశాబ్దాలుగా కృషి చేస్తున్న తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలిగా మారిపల్లి మాధవిని నియమిస్తూ ఫౌండర్ ఛైర్పర్సన్ కల్వకుంట్ల కవిత సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమానికి ఊపునిచ్చిన సమయంలో, ఈ ప్రాంత సాంస్కృతిక వైభవాన్ని, చారిత్రక నేపథ్యాన్ని పరిరక్షించి ప్రపంచానికి పరిచయం చేసే లక్ష్యంతో కవిత 2006లో తెలంగాణ జాగృతిని స్థాపించారు.
తెలంగాణ పల్లెల్లో పరిమితమైన బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తం చేయడంలో, బతుకమ్మలతో మహిళలు తెలంగాణ ఉద్యమంలో పెద్ద ఎత్తున పాల్గొనేలా ప్రోత్సహించడంలో జాగృతి కీలక పాత్ర పోషించింది.
గత రెండు దశాబ్దాలుగా కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలిగా కొనసాగగా, ఇప్పుడు సంస్థ బాధ్యతలను మారిపల్లి మాధవికి అప్పగించాలని నిర్ణయించారు.











