జైపూర్, 27.07.2026
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ప్రభుత్వ రంగ సంస్థ) ఆధ్వర్యంలో, తేది 27.07.2026న ఎస్టిపిపిలో సింగరేణి డైరెక్టర్ (ఈ&ఎం) శ్రీ ఎం. తిరుమల రావు గారు పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన 1x800 మెగావాట్ల ప్లాంట్ నిర్మాణ పనులను స్వయంగా పరిశీలించి, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ప్రభుత్వ రంగ సంస్థ) కమ్యూనికేషన్ సెల్, ఎస్టిపిపి ఏరియా ఆధ్వర్యంలో, తేది 27.07.2026న సింగరేణి డైరెక్టర్ (ఈ&ఎం) శ్రీ ఎం. తిరుమల రావు గారు ఎస్టిపిపిలో పర్యటించారు. వీరికి ప్లాంట్ ఈడి శ్రీ సిహెచ్. చిరంజీవి గారు, జిఎంలు శ్రీ ఎం నరసింహ రావు గారు మరియు శ్రీ ఎం మదన్ మోహన్ గారు స్వాగతం పలికారు.
డైరెక్టర్ (ఈ&ఎం) శ్రీ ఎం. తిరుమల రావు గారు ముందుగా 1x800 మెగావాట్ల ప్లాంట్ నిర్మాణ పనులను స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా నిర్మిస్తున్న బాయిలర్ పనులు, ట్రాక్ హపర్ పనులను పరిశీలించారు.
అనంతరం వివిధ విభాగాల విభాగాధిపతులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో డైరెక్టర్ (ఈ&ఎం) శ్రీ ఎం. తిరుమల రావు గారు మాట్లాడుతూ, 1x800 మెగావాట్ల ప్లాంట్ నిర్మాణ పనులు, బాయిలర్ పనులు, ట్రాక్ హపర్ నిర్మాణ పనుల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే ఉత్సాహంతో ప్లాంటు అధికారులు, ఉద్యోగులు అందరూ సమిష్టిగా, కలిసి పనిచేస్తూ, నిర్ణీత సమయానికి మూడో యూనిట్ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ప్లాంటు ఈడి శ్రీ సిహెచ్ చిరంజీవి గారు, ఎస్టిపిపి జీఎం శ్రీ ఎం నరసింహ రావు గారు, జీఎం(పిసిఎస్) శ్రీ మదన్ మోహన్ గారు, సిఎంఓఎఐ బ్రాంచ్ ప్రెసిడెంట్ శ్రీ డి పంతులా గారు, ఎజిఎం (ఈ & ఎం) శ్రీ సూర్యనారాయణ రాజు గారు, 1x800MW ప్లాంట్ కోఆర్డినేటర్ శ్రీ ఎం.వి. వేణుగోపాల్ గారు, పర్సనల్ విభాగాధిపతి శ్రీ ఎస్వి రాజేశ్వర్ రావు గారు, ఇతర అధికారులు మరియు ఉద్యోగులు పాల్గొన్నారు.











