మంచేరియల్, 2026-07-21
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ, అర్హులైన ప్రతి పౌరుడి పేరు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా, అనర్హుల పేర్ల తొలగింపు, వివరాల సవరణ వంటి ప్రక్రియలను పారదర్శకంగా, నిబంధనల ప్రకారం చేపట్టాలని సూచించారు.
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఈ.ఆర్.ఓ.లు, ఎ.ఈ.ఆర్.ఓ.లతో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ పురోగతిపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియను అన్ని జిల్లాలలో వేగవంతంగా పూర్తి చేసి, భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన కాలపట్టికను ఖచ్చితంగా అమలు చేయాలని తెలిపారు. అర్హులైన ప్రతి పౌరుడి పేరు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవడంతో పాటు, అనర్హుల పేర్ల తొలగింపు, ఓటరు వివరాల సవరణ వంటి ప్రక్రియలను పారదర్శకంగా, నిబంధనల ప్రకారం నిర్వహించాలని తెలిపారు.
బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి సమగ్ర సమాచారాన్ని సేకరించాలని, ప్రజలకు అవసరమైన అవగాహన కల్పిస్తూ దరఖాస్తులను స్వీకరించి త్వరితగతిన పరిశీలించాలని తెలిపారు. అందిన ఫారాలు, దరఖాస్తులను ఎలాంటి జాప్యం లేకుండా పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని తెలిపారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ఎటువంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా ప్రతి దరఖాస్తును నిష్పక్షపాతంగా పరిశీలించి, భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాల వారీగా పురోగతిని ప్రతిరోజూ సమీక్షిస్తూ, పెండింగ్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు.
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఎన్యువరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను అధికారుల సమన్వయంతో వేగవంతం చేస్తున్నామని, నిర్ణీత గడువులోగా ప్రక్రియ పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. బూత్ స్థాయి అధికారులు, బూత్ స్థాయి ఏజెంట్లు, వాలంటీర్లు, యువత సమన్వయంతో ప్రక్రియ వేగవంతానికి కృషి చేస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య, మంచిర్యాల రాజస్వ మండల అధికారి శ్రీనివాస్ రావు, ప్రత్యేక ఉపపాలన అధికారి చంద్రకళ, జిల్లా రెవెన్యూ అధికారి మోతిరామ్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.











