Yadadri Bhuvanagiri/Atmakur (M) (ప్రజావార్త) జూలై 27
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ప్రభుత్వ రంగ సంస్థ) డైరెక్టర్ (ఈ&ఎం) శ్రీ ఎం. తిరుమల రావు గారు 27.07.2026న ఎస్టిపిపిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన 1x 800 మెగావాట్ల ప్లాంట్ నిర్మాణ పనులను, బాయిలర్, ట్రాక్ హపర్ పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. నిర్ణీత సమయంలోగా మూడో యూనిట్ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ప్రభుత్వ రంగ సంస్థ) కమ్యూనికేషన్ సెల్, ఎస్టిపిపి ఏరియా: తేది 27.07.2026 రోజున సింగరేణి డైరెక్టర్ (ఈ&ఎం) శ్రీ ఎం. తిరుమల రావు ఎస్టిపిపిలో పర్యటించారు. వీరికి ప్లాంట్ ఈడి శ్రీ సిహెచ్. చిరంజీవి , జిఎం లు శ్రీ ఎం నరసింహ రావు మరియు శ్రీ ఎం మదన్ మోహన్ స్వాగతం పలకడం జరిగింది.
డైరెక్టర్ (ఈ&ఎం) శ్రీ ఎం. తిరుమల రావు గారు ముందుగా 1x 800 మెగావాట్ల ప్లాంట్ కి సంబంధించిన నిర్మాణ పనులను స్వయంగా పర్యవేక్షించారు. దీనిలో భాగంగా నిర్మిస్తున్న బాయిలర్ పనులను, ట్రాక్ హపర్ పనులను పరిశీలించారు.
అనంతరం వివిధ విభాగాల విభాగాధిపతులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో డైరెక్టర్ (ఈ&ఎం) శ్రీ ఎం. తిరుమల రావు మాట్లాడుతూ.. 1x 800 మెగావాట్ల ప్లాంట్ కి సంబంధించిన నిర్మాణ పనుల పట్ల, దీనిలో భాగంగా నిర్మిస్తున్న బాయిలర్ పనుల పట్ల, ట్రాక్ హపర్ నిర్మాణ పనుల పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. ఇదే ఉత్సాహంతో ప్లాంటు అధికారులు మరియు ఉద్యోగులు అందరు సమిష్టిగా, కలిసి పనిచేస్తూ, నిర్ణిత సమయానికి మూడో యూనిట్ పనులను పూర్తీ చేయాలనీ ఆదేశించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ప్లాంటు ఈడి శ్రీ సిహెచ్ చిరంజీవి గారు, ఎస్టిపిపి జీఎం శ్రీ ఎం నరసింహ రావు గారు, జీఎం(పిసిఎస్) శ్రీ మదన్ మోహన్ గారు, సిఎంఓఎఐ బ్రాంచ్ ప్రెసిడెంట్ శ్రీ డి పంతులా గారు, ఎజిఎం (ఈ & ఎం) శ్రీ సూర్యనారాయణ రాజు గారు, 1x800MW ప్లాంట్ కోఆర్డినేటర్ శ్రీ ఎం.వి. వేణుగోపాల్ గారు, పర్సనల్ విభాగాధిపతి శ్రీ ఎస్వి రాజేశ్వర్ రావు గారు ఇతర అధికారులు మరియు ఉద్యోగులు పాల్గొన్నారు.
ఇట్లు, STPP అధికార ప్రతినిధి









