మంచేరియల్, జూలై 22, 2026
జిల్లాలో పెండింగ్ లో ఉన్న సాదాబైనామా, భూభారతి దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు ఆదేశించారు. బుధవారం చెన్నూర్ మండల తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన, ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ పురోగతిని కూడా సమీక్షించారు.
జిల్లాలో పెండింగ్ లో ఉన్న సాదాబైనామా, భూభారతి దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు అన్నారు. బుధవారం జిల్లాలోని చెన్నూర్ మండల తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ పురోగతిని సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. సాదా బైనామా, భూ భారతి, రెవెన్యూ సదస్సుల దరఖాస్తుల ప్రస్తుత స్థితిగతులను అధికారులను అడిగి తెలుసుకొని, పెండింగ్లో ఉన్న దరఖాస్తులను క్షేత్రస్థాయి విచారణ చేపట్టి, నిబంధనల ప్రకారం నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
అనంతరం చెన్నూర్ మండలంలోని కిష్టంపేట గ్రామంలో కొనసాగుతున్న భూ రీ-సర్వే కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్, సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. రీ-సర్వే పనులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా కొనసాగుతున్నాయని, పనులను నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. రీ-సర్వే కార్యక్రమానికి రైతులు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారని, సంబంధిత అధికారులు రైతుల సమన్వయంతో కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో చెన్నూర్ మండల తహసిల్దార్ మల్లిఖార్జున్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.











