మంచేరియల్, 2026-07-22
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 39వ డివిజన్లో వర్షాకాలం దృష్ట్యా తీసుకుంటున్న జాగ్రత్తలపై మేయర్ శ్రీ దర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేష్, కమిషనర్ జీ. అన్వేష్, అదనపు కలెక్టర్ శ్రీ చంద్రయ్యతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా అధికారులకు తగిన సూచనలు చేశారు. ప్రజలకు సైతం పలు సూచనలు చేశారు.
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 39వ డివిజన్లో వర్షాకాల దృష్ట్యా తీసుకుంటున్న జాగ్రత్తలపై మేయర్ శ్రీ దర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేష్, కమిషనర్ జీ. అన్వేష్, అదనపు కలెక్టర్ శ్రీ చంద్రయ్యతో కలిసి పర్యటించి, అధికారులకు తగిన సూచనలు చేశారు. ఈ సందర్భంగా వర్షపు నీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా చూడాలని, నీటి నిల్వ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, తద్వారా వ్యాధులు ప్రబలకుండా చూడాలని డివిజన్ ప్రజలకు సూచించారు. చెత్త సేకరణలో సిబ్బందితో సహకరించాలని కూడా కోరారు.
ఈ కార్యక్రమంలో మేయర్‌తో పాటు అసిస్టెంట్ కమిషనర్ రాజకుమార్, స్థానిక కార్పొరేటర్ శ్రీమతి పుదరి సునీత ప్రభాకర్, శానిటరీ ఇన్స్పెక్టర్, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.










