పరిష్కరించినట్లు (ప్రజావార్త) సెప్టెంబర్ 12
మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో 3,500కు పైగా దీర్ఘకాలిక, ప్రిలిటిగేషన్ కేసులను ఇరువర్గాల అంగీకారంతో ప్రశాంతంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీ ఎ. వీరయ్య తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కక్షిదారుల ముఖాల్లో ఆనందం నింపింది. రాజీ మార్గమే రాజమార్గంగా సాగిన ఈ కార్యక్రమంలో మొత్తం 3,500కి పైగా దీర్ఘకాలిక, ప్రిలిటిగేషన్ కేసులను ఇరువర్గాల అంగీకారంతో ప్రశాంతంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ చైర్మన్ శ్రీ ఎ. వీరయ్య వెల్లడించారు.
దేశ ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు జిల్లా మరియు తాలూకా స్థాయిలలో నిర్వహించిన ఈ లోక్ అదాలత్ కోసం ప్రత్యేకంగా 9 బెంచ్‌లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ, లోక్ అదాలత్ ద్వారా కేసులను పరిష్కరించుకోవడం వల్ల కక్షిదారులకు సమయం, డబ్బు ఆదా అవుతాయి. ఇందులో ఎవరికీ ఓటమి ఉండదు, ఇరు వర్గాలూ విజేతలే. ఈ తీర్పుపై ఎలాంటి అప్పీలుకూ అవకాశం ఉండదు అని స్పష్టం చేశారు.
పరిష్కరించబడిన కేసుల వివరాలు
మొత్తం కేసులు: 3,500 కంటే ఎక్కువ క్రిమినల్ కేసులు: 3,300 కి పైగా సివిల్ దావాలు: 32 బ్యాంక్ ప్రిలిటిగేషన్ కేసులు: 16 (రూ. 9.84 లక్షల మొత్తం పరిష్కారం) సైబర్ క్రైమ్ కేసులు: 2 (రూ. 17,000 నగదు రికవరీ)
ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి శ్రీమతి జి. కవిత, సీనియర్ సివిల్ జడ్జి డి. రామ్మోహన్ రెడ్డి, జడ్జి ఏ. నిర్మల, బార్ అసోసియేషన్ అధ్యక్షులు కొత్త సత్తయ్య, బార్ ప్రతినిధులు, పోలీస్ లైజన్ ఆఫీసర్ సిహెచ్. వెంకటేశ్వర్లు, కోర్టు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.












