మంచేరియల్, 12 September
మంచిర్యాల నగరంలో వర్షాకాలం నేపథ్యంలో డెంగ్యూ, మలేరియా, వైరల్ జ్వరాల వ్యాప్తిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని 12వ డివిజన్ కార్పొరేటర్ శ్రీ కస్తూరి నాగరాజు విజ్ఞప్తి చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, జ్వరం వస్తే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోండి వర్షాకాలం ప్రభావం వల్ల డెంగు మలేరియా జ్వరాలు వచ్చే ప్రమాదం ఉంది *తేదీ: 12-09-2026* 12వ డివిజన్, మంచిర్యాల. మున్సిపల్ కార్పొరేషన్ 12వ డివిజన్ ప్రజలకు విజ్ఞప్తి* 12వ డివిజన్ ప్రజలందరికీ తెలియజేయునది ఏమనగా, ప్రస్తుత వర్షాకాల ప్రభావం వల్ల వాతావరణంలో మార్పుల కారణంగా డెంగ్యూ, మలేరియా, వైరల్ జ్వరాలు విస్తృతంగా వ్యాపిస్తున్నాయి. కావున డివిజన్ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండగలరు. - మీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి, నీరు నిల్వ ఉండకుండా చూసుకోండి. - దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోండి. - జ్వరం వచ్చిన 1 లేదా 2 రోజుల్లోనే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే రక్త పరీక్షలు చేయించుకోవాలి. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఎవరైనా ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లి రక్త పరీక్షలు చేయించుకోలేని పరిస్థితిలో ఉంటే, వెంటనే మన 12వ డివిజన్ కార్పొరేటర్ *శ్రీ కస్తూరి నాగరాజు గారిని* సంప్రదించగలరు. వారు మీకు ఉచితంగా రక్త పరీక్షలు చేయించే ఏర్పాటు చేస్తారు. ప్రజల ఆరోగ్యమే మా లక్ష్యం. *ఇట్లు,* *కస్తూరి నాగరాజు* *కార్పొరేటర్, 12వ డివిజన్, మంచిర్యాల*












