మంచేరియల్, జూలై 04, 2026
క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ సంధ్యారాణి రాజారమేష్ అధ్యక్షతనలో ఇరవై అంశాల ఎజెండాతో కూడిన కౌన్సిల్ సాధారణ సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశంలో ఎజెండాలోని 18 అంశాలకు కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. మిగిలిన రెండు అంశాలపై స్పష్టత లేకపోవడంతో వాటిని తదుపరి సమావేశంలో చర్చించేందుకు నిర్ణయించారు.
క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ సంధ్యారాణి రాజారమేష్ అధ్యక్షతనలో ఇరవై అంశాల ఎజెండాతో కూడిన కౌన్సిల్ సాధారణ సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎజెండాలోని 18 అంశాలకు కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.
మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ కౌన్సిలర్ సభ్యులకు ఇరవై అంశాల ఎజెండాను చదివి వినిపించారు. మిగిలిన రెండు అంశాలపై కచ్చితమైన అంచనాలు లేనందున సభ్యులు వాటిని ఆమోదించలేదని తెలిపారు. మొక్కల ఖరీదుకు సంబంధించిన విషయంలో కచ్చితమైన అంచనాలు లేనందున తదుపరి సమావేశంలో ప్రవేశ పెట్టాలని సభ్యులు కోరారు.
ఆమోదించిన 18 ముఖ్యమైన అంశాలలో వర్షాకాలంలో అత్యవసర రహదారుల మరమ్మత్తులు, నర్సరీ మొక్కల సంరక్షణ, నిర్వహణ, అనుబంధ పనుల కోసం టౌన్ లెవల్ ఫెడరేషన్ ద్వారా 6 మంది కార్మికులను 4 నెలలు నియమించుకోవడం, పక్కనే ఉన్న ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ నుండి మట్టి తీసుకోవడానికి లోడింగ్, అన్లోడింగ్ రవాణా వాహనాలకు అనుమతి, ఔట్ సోర్సింగ్ కార్మికులకు ఏడాది పాటు ఆరోగ్య బీమా, అత్యవసర నీటి సరఫరా లీకేజీలను అరికట్టడానికి అవసరమైన సామగ్రి కొనుగోలు, ప్రస్తుత సిస్టమ్ ఆపరేటర్ కాలపరిమితి పొడిగింపు, చైన్ సా పరికరం కొనుగోలు, నిర్వహించిన వార్డు సభలకు టెంట్ సామగ్రి, త్రాగునీరు, సౌండ్ సిస్టమ్, ఇతర సామాగ్రి సరఫరా బిల్లుల చెల్లింపు, రోడ్లకు ఇరువైపులా పెరిగిన పిచ్చి మొక్కల తొలగింపు, మురికి కాలువల శుభ్రపరిచే పనుల కోసం లోడర్ కొనుగోలు, ప్రత్యేక పారిశుద్ధ్య పనుల కోసం 3 నెలలకు గాను 30 మంది పారిశుద్ధ్య కార్మికులను టి.ఎల్.ఎఫ్. ద్వారా తీసుకోవడం, శ్రీనివాస్ గార్డెన్ నుండి ఏం.ఎన్.ఆర్. గార్డెన్ వరకు రోడ్డుపై జరిగే ప్రమాదాలను నివారించడానికి రాత్రిపూట కనిపించేలా రబ్బర్ స్ట్రిప్స్ ఏర్పాటు చేయడం వంటివి ఉన్నాయి.
ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మిట్టపల్లి సరిత శ్రీనివాసు, కౌన్సిల్ సభ్యులు, మున్సిపల్ రెవెన్యూ అధికారి కే. సతీష్, డి.వై.ఈ.ఈ. సాయి కిరణ్, ఎస్.ఐ. సునీల్ కుమార్, సీనియర్ అకౌంటెంట్ ఈ. వీరన్న, టి.పి.బి.ఓ. సాయి నిఖిల్, టి.పి.ఎస్. రాజ్ కుమార్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.












