హైదరాబాద్, 28-07-2026
తెలంగాణ రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి, కర్ణాటక మాజీ మంత్రి బోసురాజు రాయచూరులో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కొల్పూరు-కుర్తికొండ బ్రిడ్జ్ కమ్ బ్యారేజీల నిర్మాణంపై ఇరువురూ కీలక చర్చలు జరిపారు. ఈ ప్రాజెక్టుతో రెండు రాష్ట్రాల ప్రజలకు రవాణా, సాగు, తాగునీటి సౌకర్యాలు మెరుగుపడతాయని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి, కర్ణాటక రాష్ట్ర మాజీ మంత్రి బోసురాజు రాయచూరులో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల అభివృద్ధికి కీలకమైన కొల్పూరు – కుర్తికొండ బ్రిడ్జ్ కమ్ బ్యారేజీల నిర్మాణంపై విస్తృతంగా చర్చించారు.
కృష్ణా నదిపై ప్రతిపాదిత బ్రిడ్జ్ కమ్ బ్యారేజీల నిర్మాణం ద్వారా రెండు రాష్ట్రాల ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు సాగు, తాగునీటి అవసరాలకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. 1.5 టీఎంసీ నీటి సామర్థ్యంతో ఈ బ్యారేజీ నిర్మాణం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
ఈ ప్రాజెక్టుల అమలుకు పరస్పర సహకారంతో ముందుకు సాగాలని ఇరువురు నేతలు ఆకాంక్షించారు. సాధ్యమైనంత తొందరగా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారు.











