Mancherial/Jaipur (ప్రజావార్త) జూలై 14
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని పౌనూర్ గ్రామపంచాయతీ పరిధిలో గోదారి పల్లె వద్ద బ్రిడ్జి నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) డిమాండ్ చేసింది. ఈ మేరకు జిల్లా పంచాయతీరాజ్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం పౌనూర్ గ్రామపంచాయతీ పరిధిలోని గోదారి పల్లె వద్ద బ్రిడ్జిని వెంటనే నిర్మించాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) ఆధ్వర్యంలో జిల్లా పంచాయతీరాజ్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.
పౌనూర్ గ్రామపంచాయతీలోని ఎస్సీ కాలనీలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదివే విద్యార్థులు గోదారి పల్లె నుంచి ఎస్సీ కాలనీకి రావడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని PDSU నాయకులు తెలిపారు. గోదారి పల్లె నుండి వచ్చే మార్గంలో చెరువు మత్తడి ఉండటం వల్ల వర్షకాలంలో ప్రతి సంవత్సరం వరద నీరు ఎక్కువగా ప్రవహిస్తుందని, దీనితో విద్యార్థులు పాఠశాలకు రాలేకపోతున్నారని వారు పేర్కొన్నారు.
విద్యార్థులతో పాటు గ్రామస్తులు కూడా మత్తడి కారణంగా ప్రతి సంవత్సరం ఇబ్బందులు పడుతున్నారని, కాబట్టి విద్యార్థులు, గ్రామస్తుల సమస్యలను వెంటనే పరిష్కరించి గోదారి పల్లె వద్ద బ్రిడ్జి నిర్మించాలని PDSU విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది.











