జిల్లా కేంద్రానికి చెందిన సీనియర్ కెమెరామెన్ పులిపాక శ్రీనివాస్ అనారోగ్యంతో ఈరోజు తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఆయన మరణం మీడియా రంగంలో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
జిల్లా కేంద్రంలోని తిలక్ నగర్‌కు చెందిన పులిపాక శ్రీనివాస్, అనారోగ్యంతో బాధపడుతూ ఈరోజు తెల్లవారుజామున కన్నుమూశారు. ఈ వార్త ఆయన కుటుంబ సభ్యులతో పాటు సహచర జర్నలిస్టులను తీవ్ర దుఃఖంలో ముంచెత్తింది.
గత 20 ఏళ్లుగా ఉమ్మడి ఆదిలాబాద్ ప్రాంతంతో పాటు జిల్లా కేంద్రంలో వివిధ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో సీనియర్ కెమెరామెన్‌గా శ్రీనివాస్ సేవలందించారు. జర్నలిజం రంగంలో తనదైన ప్రత్యేకతను చాటుకుని, ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. ఆయన మరణం మీడియా రంగానికి తీరని లోటుగా అభివర్ణించారు.
ఈ విషాద సమయంలో, పలువురు ప్రముఖులు శ్రీనివాస్ పార్థివదేహాన్ని సందర్శించి ఘన నివాళులర్పించారు. తాజా మాజీ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు రేణిగుంట్ల ప్రవీణ్, రవీంద్రఖని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు దుస్సా శివప్రసాద్, సాక్షి దినపత్రిక సీనియర్ పాత్రికేయులు పొన్నాల సుమన్, 6 వెలుగు దినపత్రిక సీనియర్ పాత్రికేయులు భావండ్లపల్లి శ్రీనివాస్, సీనియర్ వీడియో జర్నలిస్ట్ సారయ్య, స్థానిక పాత్రికేయులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని, వృత్తిపరమైన సేవలను స్మరించుకున్నారు.
వారు శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.











