మంచేరియల్, 5 September
పేదల భూములను దోపిడీ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం 22 నిషేధిత భూముల జాబితాను తెచ్చిందని బీజేపీ ఆరోపించింది. ఈ జాబితాను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద బీజేపీ నాయకులు మహా దీక్ష చేపట్టారు. ఈ దీక్షల్లో రాష్ట్ర స్థాయి నాయకులతో పాటు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
*పేదల భూములు దోపిడీకి 22A నిషేదిత భూముల జాబితా తీసుకవచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం- రఘునాథ్ వెరబెల్లి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు* *కాంగ్రెస్ ప్రభుత్వం పేదల భూములు దోపిడీ చేయడానికి తీసుకవచ్చిన 22A నిషేదిత భూముల జాబితా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్. రామచందర్ రావు గారు, బీజేపీ శాసన సభ పక్ష నేత శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు, మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ ఈటెల రాజేందర్ గారు, ఎంపీలు మరియు ఎమ్మెల్యేలు చేపట్టిన 22A మహా దీక్షల్లో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి గారు బీజేపీ నాయకులతో కలిసి పాల్గొనడం జరిగింది. పేదల భూములు దోపిడీ చేయడానికి తీసుకవచ్చిన 22 A నిషేధిత భూముల జాబితాను వెంటనే రద్దు చేయాలని రఘునాథ్ గారు డిమాండ్ చేశారు. పట్టాలు ఉన్న నివాస మరియు వ్యవసాయ భూములను వెంటనే 22A జాబితా నుండి తొలగించాలని లేని పక్షంలో బాధితులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని రఘునాథ్ గారు అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, దుర్గం అశోక్, పట్టి వెంకట కృష్ణ, అందుగుల శ్రీనివాస్, అమిరిశెట్టి రాజ్ కుమార్, బింగి ప్రవీణ్, స్వామి రెడ్డి, బూర రాజశేఖర్ మరియు తదితరులు పాల్గొన్నారు








