మంచేరియల్, 2026-07-14
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ భుజానికి శస్త్ర చికిత్స జరిగిన నేపథ్యంలో, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గర్మిళ్ల శ్రీ హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు హాజరయ్యారు.
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ భుజానికి శస్త్ర చికిత్స జరగడంతో ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గర్మిళ్ల శ్రీ హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్దపల్లి పార్లమెంట్ ఇంచార్జి శ్రీ మంతెన సంపత్ కుమార్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాయకులు శ్రీ సైదల శ్రీనివాస్ ఆదేశాల మేరకు, మంచిర్యాల జిల్లా నాయకులు శ్రీ తన్నీరు మధుకర్ ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి.
ప్రధాన అర్చకులు ముస్త్యాల శ్రీనివాస్ చే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మంచిర్యాల నియోజకవర్గ నాయకులు శ్రీ ఆవునూరి రమేష్, శ్రీ మల్లంపల్లి విష్ణువర్ధన్, శ్రీ ముక్త విశ్వ, శ్రీమతి పిట్టల సంధ్యారాణి, హరీష్, చిప్పకుర్తి రంజిత్, నరేందర్, మాడుగుల నవీన్, సుధీర్, వంశీ, మరియు జిల్లా నాయకులు పాల్గొన్నారు.










