Krishna/Avanigadda Rural (ప్రజావార్త) జూలై 14
జైపూర్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చల్ల విశ్వంబర్ రెడ్డి, అనారోగ్యంతో బాధపడుతున్న శెట్టిపల్లి గ్రామ సర్పంచ్ జాగంటి సరస్వతి గోపాల్ను సోమవారం ఆయన స్వగృహంలో పరామర్శించారు. సర్పంచ్ త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
అనారోగ్యంతో బాధపడుతున్న శెట్టిపల్లి గ్రామ సర్పంచ్ జాగంటి సరస్వతి గోపాల్ను జైపూర్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చల్ల విశ్వంబర్ రెడ్డి సోమవారం ఆయన స్వగృహంలో పరామర్శించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న చల్ల విశ్వంబర్ రెడ్డి, ఆమె త్వరగా కోలుకొని ప్రజా సేవలో మళ్లీ ముందుండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. సర్పంచ్ కుటుంబానికి అవసరమైన ప్రతి సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జైపూర్ మండల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వేముల రవీందర్ గౌడ్, ఎలకంటి సర్పంచ్ గుడెల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచులు పండగ రాజన్న, తాటి జైపాల్ గౌడ్, గడ్డం ప్రసాద్ గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సతీష్ గౌడ్, నేరేడుగొండ రాంబాబు, బోయిని బాపు, ఎడ్ల అశోక్, ఆరెందల సుభాష్, జైపూర్ మండల్ కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్చార్జ్ కాస్పేట సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.












