మంచేరియల్, 15 September
మంచిర్యాల నియోజకవర్గంలో రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్, సాగునీటి సమస్యలు, జాతీయ రహదారి 63 నిర్మాణ విషయంలో కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న ద్వంద్వ వైఖరిని ఖండిస్తూ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి లక్షట్టిపెట్ పట్టణంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిజాంలా దోచుకుంటోందని ఆరోపించారు.
నిజాం లాగా రైతులను దోచుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం- రఘునాథ్ వెరబెల్లి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు *మంచిర్యాల నియోజకవర్గంలో రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్య మరియు సాగు నీరు సమస్య మరియు జాతీయ రహదారి 63 నిర్మాణ విషయంలో కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న ధ్వంద వైఖరిని ఖండిస్తూ ఈరోజు లక్షట్టిపెట్ పట్టణం ఆర్ అండ్ బి గెస్ట్ లో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి గారు పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.* ఈ సందర్భంగా రఘునాథ్ గారు మాట్లాడుతూ నిజాం పాలనలో నిజాం నవాబు రైతులను దోచుకున్న విధంగా రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకుంటుంది అని అన్నారు. రైతులకు 24 గంటల విద్యుత్ అందిస్తున్నామని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం 5-6 గంటల విద్యుత్ సరఫరా చేయకపోవడంతో రైతుల పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. అదే విధంగా మంచిర్యాల నియోజకవర్గ రైతులకు కడెం కాలువ మరియు గూడెం లిఫ్ట్ ద్వారా చివరి ఆయకట్టు వరకు సాగు నీరు విడుదల చేయకపోవడంతో సాగు నీరు అందక రైతులు పంటలు పండించలేని పరిస్థితి ఏర్పడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. రాష్ట్రంలో ఫసల్ భీమా యోజన అమలు చేయకపోవడంతో రైతులు నష్టపోతే కేంద్ర ప్రభుత్వం అందించే ఆర్ధిక సాయం కూడా రాష్ట్ర రైతులకు అందకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంటుంది అని అన్నారు. అదే విధంగా జాతీయ రహదారి 63 విషయంలో కాంగ్రెస్ పార్టీ ద్వంద వైఖరిని అవలంభిస్తోంది అని అన్నారు. మన MLA మరియు ఎంపీ కలిసి పని చేస్తే రైతులకు ఈ పరిస్థితి వచ్చేది కాదని రైతులు కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేది కాదని అన్నారు. ఒక వైపు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రహదారుల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రాష్టానికి జాతీయ రహదారులు మంజూరు చేయాలని ఫైళ్లు పట్టుకొని మోదీ గారిని మరియు నితిన్ గడ్కరీ గారిని కలుస్తూ కానీ ఇక్కడ కాంగ్రెస్ నాయకుల పరిస్థితి వేరే విధంగా ఉందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణ చేసి కేంద్ర ప్రభుత్వానికి అందిస్తే దానికి ఆమోదం తెలిపి జాతీయ రహదారి నిర్మిస్తుంది అంతే తప్ప కేంద్ర ప్రభుత్వం భూ సేకరణ చేయడమే విషయం మన MLA గారు తెలుసుకోవాలని హితవు పలికారు. గతంలో BRS ప్రభుత్వం ఉన్నప్పుడు భూ సేకరణ చేసి కేంద్రానికి పంపిస్తే దానికి కేంద్రం ఆమోదం తెలిపిందని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మరొకసారి అలైన్మెంట్ మార్చి చేసి కేంద్రానికి పంపిస్తే దానికి కూడా కేంద్రం ఆమోదం తెలిపిందని భూ సేకరణ చేయడంలో కేంద్ర ప్రభుత్వ బాధ్యత ఉండదని అన్నారు. మన MLA గారికి ఇప్పుడు రైతులు పట్ల కపట ప్రేమ పుట్టుకొచ్చిందని గతంలో ఇదే MLA జాతీయ రహదారి భూ భాదిత రైతులు MLA ఇంటికి వెళ్తే ఇంటి గేట్లు వేసి కనీసం ఇంట్లోకి కూడా రానివ్వకుండా అడ్డుకుని ఇప్పుడు రైతుల పట్ల ప్రేమ ఉన్నట్టు మొసలి కన్నీరు కారుస్తూ ఉన్నారని అన్నారు. ఇప్పుడు కొత్తగా MLA కు రైతుల పట్ల ప్రేమ ఉన్నట్టు నటిస్తూ కేంద్ర ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారని అన్నారు. జాతీయ రహదారి విషయంలో ఎల్లంపల్లి బాధితులకు న్యాయం చేయాలని బీజేపీ తలపున కోరుతున్నామని రైతులకు బీజేపీ పార్టీ అండగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం తరుఫున MLA కేంద్ర ప్రభుత్వం తరపున ఎంపీ బాధ్యత తీసుకొని రైతులకు అన్యాయం జరగకుండా జాతీయ రహదారి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ విషయంలో కొందరు కొందరు బ్రోకర్లుగా తయారై బీజేపీ పార్టీ పై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని దాన్ని సహించేది లేదని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులకు విద్యుత్, సాగు నీరు అందించి రైతులను ఆదుకోవాలని అదే విధంగా జాతీయ రహదారి రైతులకి న్యాయం చేయాలని చేశారు. ఈ కార్యక్రమంలో గోపతి రాజయ్య, వీరమల్ల హరి గోపాల్, నాగిరెడ్డి హేమంత్ రెడ్డి, గడ్డం స్వామి రెడ్డి, రమేష్ జైన్, ఆడే ప్రేమ్ సింగ్, గుండా ప్రభాకర్, బొప్పు కిషన్, సిద్దార్ద, గడికొప్పుల సురేందర్, దుమ్మని సత్తయ్య, మంద రాజేందర్, బియ్యాల లచ్చన్న, గొల్ల రాజేష్, ముష్కం గంగన్న, తగరపు గంగన్న మరియు తదితరులు పాల్గొన్నారు












