హైదరాబాద్ లో జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ ను మంచిర్యాల నియోజకవర్గం నాయకులతో కలిసి జనసేన పెద్దపల్లి ఆదిలాబాద్ పార్లమెంట్ కో-ఆర్డినేటర్ శ్రీ డా. చుంచు రాజ్ కిరణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ రాజకీయాలు, పార్టీ నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.
హైదరాబాద్ లో జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ ను మంచిర్యాల నియోజకవర్గం నాయకులతో కలిసి జనసేన పెద్దపల్లి ఆదిలాబాద్ పార్లమెంట్ కో-ఆర్డినేటర్ శ్రీ డా. చుంచు రాజ్ కిరణ్ మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా వారు మంచిర్యాల నియోజకవర్గం రాజకీయాలపై, పార్టీ నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణ మరియు పలు అంశాలపై చర్చించి పార్టీని బలోపేతం చేయాలని కోరారు. పార్టీ బలోపేతం దిశగా నాయకులు కృషి చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా అండగా ఉన్న జాతీయ, రాష్ట్ర ముఖ్య నాయకులు, జాతీయ ప్రధానకార్యదర్శి రామ్ తాళ్ళూరి, ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, ఆర్కే సాగర్, మచ్చ సుధాకర్, గడల శ్రీనివాస రావు, గొట్టేముక్కల నరేష్ రెడ్డి, ప్రజ్యోత్ గౌడ్, సంపత్ ప్రేమ్ గాంధీలకు కృతజ్ఞతలు తెలిపారు. వీరి సహకారం పార్టీకి ఎంతో విలువైనదని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఆవుల సాగర్, మేకల పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్న నాయకులను పవన్ కళ్యాణ్ అభినందించారు.












