మండలం పెద్దకల్వల గ్రామ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, గ్రామ ఉపసర్పంచ్ పర్స లక్ష్మీ శంకర్, వార్డు సభ్యులు జక్కుల రుక్కమ్మ, బీఆర్ఎస్ నాయకులు లక్ష్మి నారాయణ, పర్స పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు నాయకులు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
మండలం పెద్దకల్వల గ్రామ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, గ్రామ ఉపసర్పంచ్ పర్స లక్ష్మీ శంకర్, ఒకటవ వార్డు సభ్యులు జక్కుల రుక్కమ్మ, బీఆర్ఎస్ నాయకులు లక్ష్మి నారాయణ, పర్స పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు నాయకులు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి గౌరవ రాష్ట్ర ప్రభుత్వ విప్, శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి మరింత తీసుకెళ్లే విధంగా పనిచేయాలని ప్రభుత్వ విప్ విజయరమణ రావు వారందరికీ పిలుపునిచ్చారు. పార్టీలో చేరిన నాయకులు కాంగ్రెస్ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో పెద్దకలవల మాజీ సర్పంచ్, ఉపసర్పంచ్, గ్రామ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ చేరికతో నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని నాయకులు అభిప్రాయపడ్డారు.











