సుల్తానాబాద్, 5 October
పెద్దపల్లి పార్లమెంట్ మాజీ కేంద్రమంత్రి కాకా గడ్డం వెంకటస్వామి గారి 97వ జయంతిని పురస్కరించుకుని సుల్తానాబాద్ పట్టణంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
పెద్దపల్లి పార్లమెంట్ మాజీ కేంద్రమంత్రి, కాకా గడ్డం వెంకటస్వామి గారి 97వ జయంతిని పురస్కరించుకుని సుల్తానాబాద్ పట్టణంలోని ఆయన విగ్రహానికి ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్, పట్టణ కౌన్సిలర్లు, సింగిల్ విండో చైర్మన్లు, డైరెక్టర్లు, పట్టణ, మండల, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, కాకా అభిమానులు, పలు గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










