శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు జన్మదినోత్సవం సందర్భంగా టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి అందించారు.
శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు జన్మదినోత్సవం పురస్కరించుకొని టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో నేతలు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి మాట్లాడుతూ, శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ సాగర రావు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని భగవంతుని ప్రార్థించినట్లు తెలిపారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లకు రావాల్సిన పిఆర్సి, పెండింగ్ డిఏ బకాయిలు, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ విధానం, సమర్థవంతమైన ఈహెచ్ఎస్ విధానం తీసుకురావాలని గౌరవ ఎమ్మెల్యేకు వినతి అందించారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కార దిశగా తన వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా కార్యదర్శి బొడ్డు శ్రావణ్ కుమార్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాపు రావు, కోశాధికారి సతీష్ కుమార్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, కేజియా రాణి, తిరుపతి రామ్ కుమార్, సత్యనారాయణ, నరేందర్, అంజయ్య, సంయుక్త కార్యదర్శులు సునీత, ప్రభు తదితరులు పాల్గొన్నారు.











