మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ వేంపల్లి 15 వ డివిజన్ లో బీజేపీ నేతలు మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి, ఇతర బీజేపీ నేతలతో కలిసి మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా, ఆయన పర్యావరణాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. గ్లోబల్ వార్మింగ్ ను అరికట్టడానికి మొక్కలు నాటడం ముఖ్యమని తెలిపారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారి 'ఏక్ పేడ్ మా కే నామ్' కార్యక్రమంలో భాగంగా ఈ మొక్కలు నాటడం జరిగింది.
ఈ కార్యక్రమంలో అనేక బీజేపీ నాయకులు పాల్గొన్నారు.








