మంచేరియల్, 2026-07-01
క్యాతనపల్లి మున్సిపాలిటీలోని MNR గార్డెన్స్‌లో సింగరేణి పరిరక్షణ సదస్సు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ గారు పాల్గొన్నారు. పలువురు ఇతర నాయకులు కూడా హాజరయ్యారు.
చెన్నూరు నియోజకవర్గం, క్యాతనపల్లి మున్సిపాలిటీలోని MNR గార్డెన్స్‌లో శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి మూడు సింగరేణి డివిజన్ల సింగరేణి పరిరక్షణ సదస్సు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు, సిద్దిపేట శాసనసభ్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారితో కలిసి మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు గారు, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ గారు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు, మంచిర్యాల జిల్లా బిఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు బాల్క సుమన్ గార్లు, ఎమ్మెల్యే కోవా లక్ష్మీ గారు, మాజీ ఎమ్మెల్యేలు దుర్గం చిన్నయ్య, పుట్ట మధు గార్లు, TBGKS రాష్ట్ర అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి, జనరల్ సెక్రెటరీ కేతిరెడ్డి సురేందర్ రెడ్డి గారు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు భూక్య జాన్సన్ నాయక్, కౌశిక హరి, ఎర్రోళ్ల శ్రీనివాస్ గార్లు కూడా పాల్గొనడం జరిగింది.











