మంచేరియల్, 2026-07-01
ప్రజల పన్నుల నిధులతో సుమారు రూ.10 కోట్లతో నిర్మించిన మంచిర్యాల మహాప్రస్థానం నిర్వహణను ట్రస్ట్ ఆధీనంలో కొనసాగించడం చట్టవిరుద్ధమని బీజేపీ కార్పొరేటర్లు ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే అధ్యక్షతన ఏర్పాటు చేసిన ట్రస్ట్ బాధ్యతలు చేపట్టడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్తిని వ్యాపార కేంద్రంగా మార్చారని విమర్శించారు.
ప్రజల పన్నులు, మున్సిపల్ జనరల్ ఫండ్ నిధులు, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక పథకాల నిధులతో సుమారు రూ.10 కోట్ల వ్యయంతో నిర్మించిన మంచిర్యాల మహాప్రస్థానం నిర్వహణను ట్రస్ట్ ఆధీనంలో కొనసాగించడం చట్టవిరుద్ధమని బీజేపీ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు ఆరోపించారు.
స్థానిక ఎమ్మెల్యే అధ్యక్షతన ఏర్పాటు చేసిన ట్రస్ట్ మహాప్రస్థానం నిర్వహణ బాధ్యతలు చేపట్టడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని వారు పేర్కొన్నారు. వైకుంఠధామం, నీటి సరఫరా, విద్యుత్ వంటి అన్ని వసతులు మున్సిపాలిటీ నిధులతో నిర్వహించబడుతున్నప్పటికీ, ట్రస్ట్ పేరుతో వేల రూపాయల ఫీజులు వసూలు చేయడం ప్రభుత్వ ఆస్తిని వ్యాపార కేంద్రంగా మార్చడమేనని విమర్శించారు.
అంతేకాకుండా, మహాప్రస్థానం అధికార పార్టీ నాయకుల సమావేశాలకు వేదికగా మారిందని ఆరోపిస్తూ, దానిని పూర్తిగా మున్సిపల్ కార్పొరేషన్ అధికార పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వాలు ప్రముఖులకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్న నేపథ్యంలో, ప్రజల పన్నులతో నిర్మించిన మహాప్రస్థానంలో సాధారణ ప్రజలకు కూడా గౌరవప్రదంగా దహన సంస్కారాలు నిర్వహించే అవకాశం కల్పించాలని, అందుకోసం దహన సంస్కారాల ఫీజును కేవలం రూ.1గా నిర్ణయించాలని బీజేపీ కార్పొరేటర్లు కోరారు.
గాజుల ముఖేష్ గౌడ్ – కార్పొరేటర్ (57వ డివిజన్), బీజేపీ ఫ్లోర్ లీడర్, కస్తూరి నాగరాజు – కార్పొరేటర్ (12వ డివిజన్), బోట్ల అనిత సత్యం – కార్పొరేటర్ (58వ డివిజన్) మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్.











