Suryapet/Atmakur (S) (ప్రజావార్త) జూలై 01
మందమర్రి మండలం బొక్కలగుట్ట గ్రామంలో గజ్జి వెంకటేష్ @ స్వామి (40) హత్య కేసులో నిందితుడైన ఓడ్డేపల్లి రాజ్‌కుమార్ @ కుమార్ (28)ను పోలీసులు అరెస్టు చేశారు. పిర్యాదురాలి ఫిర్యాదు మేరకు రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్లో హత్య కేసు నమోదు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితుడిని పట్టుకున్నారు.
మందమర్రి మండలం బొక్కలగుట్ట గ్రామానికి చెందిన గజ్జి వెంకటేష్ @ స్వామి (40) హత్య కేసులో నిందితుడైన ఓడ్డేపల్లి రాజ్‌కుమార్ @ కుమార్ (28)ను పోలీసులు అరెస్టు చేశారు. పిర్యాదురాలి గజ్జి మమత లావణ్య ఫిర్యాదు మేరకు రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్లో హత్య కేసు (క్రైం నెం.124/2026, సెక్షన్ 103(1), 351(2) భీ ఎన్ ఎస్) నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ అంబర్ కిషోర్ జా (డి.ఐ.జి)ఐపిఎస్, మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ ఐపీఎస్, బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్ ఆదేశాల మేరకు మందమర్రి సీఐ రమేష్, రామకృష్ణాపుర్ ఎస్సై శ్రీధర్ నేతృత్వంలో పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. నిన్న తేదీ 29.06.2026 సాయంత్రం శ్రీ రామ కాలనీ కమాన్ ముందు, కుర్మపల్లి ఫ్లై ఓవర్ దగ్గర నిందితుడిని అరెస్టు చేశారు.
విచారణలో నిందితుడు తెలిపిన వివరాల ప్రకారం, గతంలో మృతుడు గజ్జి వెంకటేష్ తన మేనకోడలితో తన వివాహాన్ని గ్రామ పెద్దల సమక్షంలో ఇష్టం లేకుండా జరిపించిన విషయం మనసులో పెట్టుకుని కక్ష పెంచుకున్నాడు. ఇటీవల తన మొబైల్ ఫోన్ ధ్వంసమైన విషయమై మృతుని కుటుంబంతో వివాదం కూడా ఏర్పడింది.
తేదీ 28.06.2026 రాత్రి బొక్కలగుట్ట గ్రామంలోని చిప్పరి శ్రీనివాస్ ఇంటి సమీపంలో మృతుడితో గొడవపడి, అక్కడ ఉన్న సిమెంట్ రాయితో దాడి చేసినట్లు అంగీకరించాడు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలై మృతుడు మృతి చెందాడు.
ఈ సందర్భంగా మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పర్శ రమేష్ మాట్లాడుతూ, నిందితుడు పాత కక్షలు, వ్యక్తిగత వివాదాల నేపథ్యంలో హత్యకు పాల్పడినట్లు వెల్లడించారు. నిందితుడిని న్యాయస్థానం ముందు హాజరుపరచగా, రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
వ్యక్తిగత వివాదాలను హింసాత్మకంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించకుండా, చట్టపరమైన మార్గాలను ఆశ్రయించాలని రామకృష్ణాపూర్ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన మందమర్రి సీఐ పర్ష రమేష్, రామకృష్ణ పూర్ ఎస్సై శ్రీధర్, వారి సిబ్బందిని పోలీస్ ఉన్నతాధికారులు అభినందించారు.












