జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని, జనగామ జిల్లా తబిత ఆశ్రమంలో బిజెపి పార్టీ శ్రేణులు ఘనంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కందుల సంధ్యారాణి సూచనల మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు.
ఆశ్రమంలోని చిన్నారుల సమక్షంలో వడ్డేపల్లి రామచందర్ జన్మదిన వేడుకలు జరిపిన అనంతరం, పార్టీ శ్రేణులు వారికి అన్నదానం చేశారు. ఈ సందర్భంగా సమాజ సేవ లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ముందుకు సాగుతోందని వారు తెలిపారు.
వడ్డేపల్లి రామచందర్ ప్రజా సేవలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా పార్టీ నాయకులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం ద్వారా తమ సేవా భావాన్ని చాటుకున్నారు.
ఈ కార్యక్రమంలో జనగామ మండల అధ్యక్షులు గుండబోయిన భూమయ్య, జక్కన్న బాలు, జక్కుల పద్మ, బూడిద హర్ష, చిలువేరు కుమార్, హనుమాన్ల వెంకటేష్, కుమార్, ఏరుకొండ తిరుపతి, సింగారం శ్రీకాంత్, ఓబీసీ మోర్చా నాయకులు, పార్టీ కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.












