కబుర్లు టుడే (కబుర్లు టుడే) జూన్ 20
మల్కపేట గ్రామానికి చెందిన మాజీ వార్డు సభ్యుడి కుటుంబానికి భరోసా
మండలంలోని మల్కపేట గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ వార్డు సభ్యుడు కాసాని గట్టయ్య (48) అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం మృతిచెందారు. ఆయన మృతి పట్ల బీఆర్ఎస్ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శనివారం మండలంలోని బీఆర్ఎస్ నాయకులు మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మృతుని కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇస్తూ, పలువురు నాయకులు ఆర్థిక సహాయం అందించారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి రూ.5వేలు, గద్దల నరసింగరావు రూ.2500, ఇమ్మడి శ్రీనివాస్ రెడ్డి రూ.5వేలు, పెద్ది రాజిరెడ్డి రూ.2500, చింతకింది సురేస్ రూ.2500, నీరేటి సుధాకర్ రూ.2500, తేజావత్ గోవర్ధన్ రూ.2000, కంతి రాజలింగం రూ.2వేలు, ఇట్టబోయిన రమేష్ రూ.1000 చొప్పున మొత్తం రూ.25,000లను వారి కుటుంబసభ్యులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు కంతి ఆంజనేయులు, సర్పంచ్ బానోత్ మహేందర్, నాయకులు ఎండీ గౌస్, గుగులోత్ కిషన్, బ్రహ్మాచారి, బానోత్ రవీంధర్, గడ్డ పర్షరాములు, రమేష్, అశోక్, మోహన్, విజయ్, రవి, యాకూబ్, రాజన్న, నాగరాజు, శ్రీకాంత్, షజి తదితరులు పాల్గొన్నారు.












