ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని రామకృష్ణాపూర్ లోని స్థానిక తవకల్ పాఠశాలలో మేడే వేడుకలను పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులను ఘనంగా సన్మానించారు.
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి అబ్దుల్ అజీజ్, జిల్లా కార్యదర్శి మహంకాళి శ్రీనివాస్, సీనియర్ నాయకులు గాండ్ల సమ్మయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, మున్సిపల్ కార్మికులకు పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కార్మికుల హక్కులు, ఐక్యత, వారి శ్రమను గుర్తించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. చికాగోలో 1886లో జరిగిన కార్మికుల పోరాటాన్ని, భారతదేశంలో ట్రేడ్ యూనియన్ల ప్రారంభాన్ని గుర్తు చేసుకున్నారు.
8 గంటల పని దినాలు, విశ్రాంతి, వినోదాల కోసం చట్టాలు రూపొందించబడ్డాయని, చెన్నూరు నియోజకవర్గానికి కార్మిక శాఖ మంత్రిగా వివేక్ వెంకటస్వామి ఉండటం అదృష్టమని పేర్కొన్నారు. మున్సిపల్ కార్మికులు నిత్యం సేవలందిస్తూ, సమాజానికి ఎంతో సేవ చేస్తున్నారని, వారి సేవలను కొనియాడారు.
మున్సిపల్ కార్మికులు తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ, సమాజానికి అవసరమైన పారిశుద్ధ్య సేవలను అందిస్తున్నారని, వారిని సన్మానించడం తమకు సంతోషాన్నిచ్చిందని నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మెట్ట సుధాకర్, చంద్రగిరి ఎల్లయ్య, మాజీ ఎంపీటీసీ పుల్లూరి కళ్యాణ్, నాయకులు సత్యపాల్ తదితరులు పాల్గొన్నారు.








