జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ శుక్రవారం హాజీపూర్ మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు.
కులెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం రూపొందించిన నిబంధనల ప్రకారం కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. రైతులు ధాన్యాన్ని తీసుకువచ్చే సమయంలో మట్టి గడ్డలు, తేమ వంటి ప్రమాణాలను పాటించాలని ఆయన కోరారు.
కొనుగోలు కేంద్రాలలో రైతుల సౌకర్యార్థం త్రాగునీరు, నీడ, తూకం యంత్రాలు, ప్యాడి క్లీనర్లు వంటి సదుపాయాలు ఉండాలని తెలిపారు.
ధాన్యం తూకం వేసిన తర్వాత ఆన్ లైన్ లో ట్రక్ షీట్ జనరేట్ చేయబడుతుందని, రైతుల వివరాలను సిస్టంలో నమోదు చేసుకోవడం, ఆధార్ కార్డు ద్వారా గుర్తింపును దృవీకరించడం ముఖ్యమని ఆయన చెప్పారు.









