మంచిర్యాల (ప్రజావార్త) నవంబర్ 21
మంచిర్యాల జిల్లా ట్రెజరీ కార్యాలయం, పే అండ్ అకౌంట్స్ కార్యాలయంలో టీఎన్జీవో సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా జరిగింది. జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 30 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులు సభ్యత్వం తీసుకున్నారు.
మంచిర్యాల జిల్లా ట్రెజరీ కార్యాలయం, పే అండ్ అకౌంట్స్ కార్యాలయంలో టీఎన్జీవో సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ రెండు కార్యాలయాల్లో పనిచేస్తున్న 30 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులు టీఎన్జీవో సభ్యత్వం స్వీకరించారు.
ఈ సందర్భంగా టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ గడియారం శ్రీహరి మాట్లాడుతూ, ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో టీఎన్జీవో సంఘం ఎల్లవేళలా కృషి చేస్తుందని తెలిపారు. మంచిర్యాల జిల్లాలోని ఇంకా మిగిలిన యూనిట్లలో కూడా సభ్యత్వ నమోదును అతి త్వరలోనే పూర్తి చేస్తామని, తద్వారా రాష్ట్రంలోనే మంచిర్యాల జిల్లా మొదటి స్థానంలో నిలుస్తుందని, ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు.
ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో టీఎన్జీవో మంచిర్యాల జిల్లా కార్యదర్శి బొడ్డు శ్రావణ్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాపురావు, ఉపాధ్యక్షులు రాంకుమార్, తిరుపతి, సంయుక్త కార్యదర్శి సునీత, ప్రచార కార్యదర్శి యూసుఫ్, మంచిర్యాల యూనిట్ అధ్యక్షులు నాగుల గోపాల్, కార్యదర్శి అజయ్ తో పాటు ట్రెజరీ శాఖ, పే అండ్ అకౌంట్ శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు.







