మంచేరియల్, బుధవారం
మంచిర్యాల పట్టణంలో బుధవారం యూట్యూబ్ కళాకారులు నిర్వహించిన బోనాల జాతర ఆకట్టుకుంది. జిల్లా నలుమూలల నుంచి 300 మంది కళాకారులు పాల్గొని, ఆటపాటలతో సందడి చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రముఖులు హాజరై, కళాకారులను ప్రోత్సహించారు.
మంచిర్యాల పట్టణంలోని టూటౌన్ ఏరియా హమాలివాడలో బుధవారం యూట్యూబ్ కళాకారులు బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుండి సుమారు 300 మంది కళాకారులు ఈ జాతరలో పాల్గొన్నారు. అండర్ బ్రిడ్జి చౌరస్తా నుండి కట్ట పోచమ్మ ఆలయం వరకు ఈ జాతర ఉత్సాహంగా సాగింది.
నల్ల కోటమ్మ లక్ష్మయ్య ట్రస్ట్ చైర్మన్, కార్పొరేటర్ నల్ల శంకర్ జాతరను ప్రారంభించి, పాల్గొన్న కళాకారులకు భోజన వసతిని కల్పించారు. జాతర సందర్భంగా పలువురు యూట్యూబ్ కళాకారులు తమ ఆటపాటలతో ప్రేక్షకులను అలరించారు. పోచమ్మ, ఎల్లమ్మ భక్తి పాటలతో సందడి చేశారు. ప్రత్యేకించి, వెరైటీ ఆటపాటలను చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపారు.
పోచమ్మ తల్లికి బోనాలను సమర్పించి, పలువురు సెలబ్రిటీ యూట్యూబ్ కళాకారులను ఈ సందర్భంగా సత్కరించారు.












