మంచేరియల్, 2026-07-06
మంచియాలజిలలాఇిగేషనాఖలోనూతనంగాచఫఇంజనగాబాయతలుచేపటటినఎవివిఎనసింహాావునుటఎనజవోమంచియాలజిలలాఅయకషులుగడియాంహిఆవయంలోజిలలాకమిటసభయులుఎస్ంగాసనమానించాు.ఈసందభంగాఆయనకుుభాకాంకషలుతెలియజేాు.
మంచిర్యాల జిల్లా ఇరిగేషన్ శాఖలో చీఫ్ ఇంజనీర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎ వి వి ఎస్ నరసింహారావును టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో జిల్లా కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించి, పదవీ బాధ్యతల శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి మాట్లాడుతూ, నూతనంగా బాధ్యతలు చేపట్టిన చీఫ్ ఇంజనీర్ సార్‌కు ఇరిగేషన్ శాఖ ఉద్యోగులు ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందించాలని కోరారు. అదేవిధంగా, చీఫ్ ఇంజనీర్ సార్ కూడా ఇరిగేషన్ శాఖలోని ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సన్మాన సభలో టీఎన్జీవో మంచిర్యాల జిల్లా కార్యదర్శి బొడ్డు శ్రావణ్ కుమార్, కేంద్ర సంఘం కార్యదర్శి , పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాపురావు, కోశాధికారీ సతీష్ కుమార్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, తిరుపతి, రాంకుమార్, శివ ప్రసాద్, నరేందర్, కేజియా రాణి, సంయుక్త కార్యదర్శి సునీత, ప్రభు, రోశయ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీ మోసిన్, మంచిర్యాల యూనిట్ అధ్యక్షులు నాగుల గోపాల్, కార్యదర్శి అజయ్, బెల్లంపల్లి యూనిట్ అధ్యక్షులు వెంకటేష్, కార్యవర్గ సభ్యులు చంద్ర శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.









